నాగవల్లి Telugu Movie Review |
Rating : 3.25 / 5 Star Cast : వెంకటేష్, అనుష్క, శ్రద్దా దాస్, రిచా, కమిలిని, పూనమ్ కౌర్, బ్రహ్మానందం, ధర్మవరపు, శరత్ బాబు, ప్రభ, రక్ష, అవినాష్, ఎం.ఎస్ తదితరులు... Directed by : పి.వాసు Produced by : బెల్లంకొండ సురేష్ కథ : శరత్ బాబు అతని భార్య ప్రభ వారి కుమార్తెలు నలుగురు నివశించే ఇంట్లోకి చంద్రముఖి(అనుష్క) చిత్రపటం వస్తుంది. అది వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ సంఘటనలతో ఆందోళన చెందిన శరత్ బాబు దంపతులు రాజేశ్వర్ సిద్దాంతి (అవినాష్)ని కలిసి తమ ఇంట్లోని పరిస్థితులని వివరిస్తారు. శరత్ బాబు దంపతులకున్న ఆ నలుగురిలో ఒకరిని చంద్రముఖి అవహించిందని సిద్దంతికి ఒక అనుమానం కలుగుతుంది. అయితే ఈ సమస్యను పరిష్క రించే వ్యక్తి ఒకరున్నారని డాక్టర్ విజయ్ (వెంకటేష్) గురించి ఆ దంపతులకి చెప్తాడు సిద్దాంతి. డాక్టర్ విజయ్ ఎంట్రీ తో ఇక అసలు కధ మొదలుతుంది. ఇంతకి ఆ చిత్రపటం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఆ నలుగురిలో నాగవల్లి ఎవరిని ఆవహించింది? అసలు ఈ చంద్రముఖి ఎవరు? అన్న కోణంలో డాక్టర్ విజయ్ తన సోదన సాగిస్తాడు...మిగిలిన కధకి వెండితేరే కరెక్ట్. తారాగణ తీరు : వెంకి తన సాఫ్ట్ రోల్స్ కి భిన్నంగా తొలిసారిగా ఒక కొత్త పాత్రని పోషించినా తన అద్భుతమైన నటనను ప్రదర్శించాడనే చెప్పాలి. చిత్రంలో ద్విపాత్రాలను పోషించిన వెంకి ఆ రెంటికి తగిన న్యాయం చేసాడు. ముఖ్యంగా మహారాజు నాగభైరవగా వెంకి నటనకి ప్రేక్షకులు అదరహో అనటం ఖాయం. ఇక గతంలో అరుంధతి చిత్రం ద్వారా తన నటనా చాతుర్యాన్ని చూపించిన అనుష్క అదే తరహా నటనతో తన పాత్రకి ప్రాణం పోసింది. శ్రద్దా దాస్ కూడా కొన్ని కొన్ని సన్నివేశాలలో తన దిన శైలిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. రిచా నటనాపరంగా కంటే సౌదర్యంతో అందరిని అలరించింది. ఇక కమిలిని, పూనమ్, సుజా వారి వారి పాత్రలు, ప్రధాన్యతలని బట్టి కొద్దిసేపు మురిపించారు. దర్శకత్వం : పి.వాసు చిత్రంలో ప్రతి ఫ్రేంలోనూ తనదైన శైలిని కనభరిచారు. స్క్రీన్ ప్లే, కధాంశాలని అద్భుతంగా మలిచారు. అన్ని విభాగాలలోనూ అత్యంత శ్రద్ద తీసుకుని చెయ్యటం జరిగింది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాలలో, పాత్రలను మలచటంలో తగు జాగర్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. ఎంతైనా చంద్రముఖి మొదటి భాగంలో ఉన్నంత పట్టు ఈ చిత్రంలో కనిపించలేదనే చెప్పాలి. సంగీతం : గురు కిరణ్ అందించిన సంగీతం అంత చెప్పుకోదగినదిగా లేదు. నాగవల్లి పాటలు ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేక పొయ్యాయి. అయితే చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆడియో పరంగా చూస్తే కాస్తంత పర్లేదనిపించింది. చిత్రంలో ఉన్న ప్రధాన మైనస్ లలో సంగీతం ఒకటని చెప్పచు. ప్రత్యేకతలు : వెంకటేష్ త్రిపాత్రభినయం, అనుష్క నటన, దర్శకుడు కధను తెరకెక్కించిన తీరు, చిత్రంలో ఉపయోగించిన గ్రాఫిక్స్.... క్లుప్తంగా : కొత్త పాత్ర అయినా ఎప్పటిలానే వెంకి అన్నిరకాల ప్రేక్షకులని అలరించాడు. వెంకి నెగెటివ్ రోల్ చిత్రంలో హైలెట్. వెంకటేష్ రిచా కాంబినేషన్ అందరిని ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా వాసు ప్రశంసలు పొందుతాడు. సంగీతం మరింత మెరుగుగా ఉంటే బాగుండేది. |
Recently Added Movies
Most Awaiting Movie Nagvalli Movie Review - 3.25
Thursday, December 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment